Congress: ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసి మొత్తం 17 అంశాలపై ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యల అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: Dgp Ravi Gupta: నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన డీజీపీ
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలిస్తే ఆస్తులను ముస్లింలకే ఇచ్చేస్తారంటూ వ్యాఖ్చానించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చేవిధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోడీ మాట్లాడారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో తెలిపింది. ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేలా వ్యవహరించారని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపింది. మతం ఆధారంగా మోడీ ఓట్లడిగారని.. విపక్ష పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా లేనిపోని నిందలు వేశారని ఫిర్యాదులో పేర్కొంది.
ఇది కూడా చదవండి: RCB vs KKR: అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందా.. వీడియో వైరల్..
ఇక సూరత్‌లో ఎన్నిక వాయిదా వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం.. నలుగురు కాంగ్రెస్ నేతలు మిస్ అయ్యారని తెలిపింది. దీంతో సూరత్‌లో ఎన్నిక వాయిదా వేయాలని అభ్యర్థించింది. ఇక యూజీసీలో నియామకాలు చేపట్టడాన్నీ కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రధాని, ఆయన పార్టీ చేస్తున్న ధిక్కార, ఉద్దేశపూర్వక ఉల్లంఘనలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఒకవేళ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఎన్నికల సంఘంపై ఉన్న గౌరవానికి మచ్చ వస్తుందని అభిప్రాయపడింది.
సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. అనంతరం స్వతంత్ర అభ్యర్థుల కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు బీజేపీ నేతంతా సంబరాలు చేసుకున్నారు. బీజేపీ గెలిచిన తొలి సీటు అంటూ నేతలు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Tenth Topper: ‘టెన్త్’ ఫలితాల్లో సరికొత్త రికార్డు.. 599 మార్కులతో ‘టాప్’ లేపిన మనస్వి..
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!