సార్వత్రిక ఎన్నికల హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్‌ఫేక్ వీడియో తీవ్ర కలకలం రేపింది. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఒక నకిలీ వీడియో రావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌కు సోషల్ మీడియా ద్వారా రావడంతో పలువురుకి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్ ఖాతాను ‘ఎక్స్’ (ట్విటర్) నిలిపివేసింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఎక్స్ ఈ చర్య తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎస్‌ఐ తెలిపింది. ఈ హ్యాండిల్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఖాతాను కాంగ్రెస్ ‘ఎక్స్’ నిలిపివేసింది.
ఇది కూడా చదవండి: SHR vs RR: సన్‌రైజర్స్ ప్లేయర్లకు చేదు అనుభవం.. స్టార్ ఆటగాడిని తోసేసిన ఫాన్స్!
మరోవైపు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్‌కు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద నోటీసు జారీ చేసింది. మే 2న సెల్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. ఢిల్లీ పోలీసుల నుండి నోటీసు అందిందని.. కానీ తనకు ఎందుకు నోటీసు ఇచ్చారో అర్థం కాలేదన్నారు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదఅని ఠాకూర్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: SIM Cards Block: పాకిస్తాన్‌లో 5 లక్షల మంది సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా..?
జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర సమన్వయకర్త గజేంద్ర కుమార్ సింగ్‌కు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసి, మే 3న తమ ఎదుట హాజరు కావాలని కోరారు. పార్టీ న్యాయ సలహాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గజేంద్ర కుమార్ తెలిపారు. జార్ఖండ్ కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు మా ఖాతాను నిలిపివేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులు ఎక్స్‌ను కోరారని గజేంద్ర కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sharad Pawar: ప్రధాని మోడీ నా వేలు పట్టుకుని రాజకీయాలు నేర్చుకున్నారు..