ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నగీనా రిజర్వ్‌డ్ సీటు నుంచి ఎంపీగా గెలిచిన ఏఎస్పీ అధినేత చంద్రశేఖర్.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు తాను ఏం చేయగలిగితే అది శక్తివంతంగా చేశానని అన్నారు.
ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించొద్దని వ్యాఖ్యానించారు.
Lok Sabha Election : 2024 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జూన్ 1న ముగిసింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. 18వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 8360 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖత్తార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివ్ ప్రకాష్, మన్షుక్ మండవీయ, బీఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు.