Supreme Court: ఎలక్షన్ కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుల నియామకంపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ చేపట్టనుంది. మాజీ ఐఏఎస్ అధికారులైన ఇద్దరిని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిన్న ఎంపిక చేసింది.
Congress-DMK: లోక్‌సభ ఎన్నికల తేదీలు ఈసీ విడుదల చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పలు పార్టీల మధ్య పొత్తుల చర్చల్లో వేగం పెరిగింది. తాజాగా తమిళనాడులోని అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్ పూర్తైంది. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)తో కూడా సీట్ల ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీకి 10 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.