గత ఏడాదిన్నర కాలంగా మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. అనతికాలంలోనే ఈ మహమ్మారి.. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. వైరస్ ఉధృతికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ తదితర దేశాలు చిగురాటాకుల వణికిపోయాయి. ఇక ప్రస్తుత కేసుల పరిస్థితి చూస్తే.. భారత్ కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడినట్లే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రికవరీలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడం ఆనందించే విషయం. ప్రస్తుతం 92% రికవరీ రేటు పెరగడంతో.. కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగానే వైద్యులు చెబుతున్నారు.