కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలా తమన్నా కూడా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా తమన్నా ఓ సందేశాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. షూటింగ్స్ లేక రోజువారీ పనిదినాల్లో కూడా మార్పులు రావడంతో తమన్నా డైలామాలో తెలుస్తోంది. ‘స్నానం చేయాలా.. ? వద్దా..? అనే సందేశాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ సలహాని ఇవ్వాలంటూ కోరింది. లాక్ డౌన్ ఇలా మార్చేసిందంటూ తమన్నా చెప్పుకొచ్చారు. లాక్డౌన్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో తమన్నా పోస్ట్ చేసింది.