కరోనా పుట్టినిల్లు డ్రాగన్ దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భయపెడుతున్నాయి.. చైనా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్ మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయింది. చైనాలో కొత్తగా 157 కోవిడ్ కేసులు నమోదుకాగా.. వీటిలో 52 బీజింగ్‌లోనే వెలుగు చూశాయి. జీరో కోవిడ్ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి నగరంలో లాక్‌డౌన్ అమలు చేశారు. దీంతో మరిన్ని నగరాలు లాక్‌డౌన్ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్‌యి,…
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా చైనాలో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు అనేక నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా కరోనా ఆంక్షలు, నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా చైనాలో 40కోట్ల మంది ప్రజలు ఆంక్షల గుప్పిట్లో ఉన్నారు. కరోనా విజృంభణతో చైనాలోని ప్రధాన నగరాలు వణికిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో షేన్‌ఝేన్‌లో మొదట కొవిడ్ ఆంక్షలు మొదలుపెట్టారు. ఇప్పుడు షాంఘై వరకు ఆంక్షలు…
కరోనాకు పుట్టినిల్లయిన చైనా ఇప్పుడు మళ్ళీ కరోనా టెన్షన్ తో అతలాకుతలం అవుతోంది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. చైనాలో సోమవారం 13 వేలకు పైగా కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. షాంఘైలోనో 70 శాతం కేసులు వెలుగులోకి రావడంతో చైనా అప్రమత్తం అయింది. కేసుల నివారణకు 2 వేల మంది సైన్యం, 15 వేలమంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికి రెండు పరీక్షలు…
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం…
ఓ వైపు కరోనా విజృంభిస్తోంది.. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది.. కానీ, ఇదే సమయంలో ఓ పార్టీ జరిగింది.. అది కూడా ప్రధాని నివాసం ఉన్న వీధిలోనే.. ఇదే ఇప్పుడు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను చిక్కుల్లో పడేసింది… ఆయన నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఓ పార్టీ వ్యవహారంలో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు.. వాటికి సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల డెడ్‌లైన్ పెట్టారు.. ఈ…
2020 నుంచి ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్నది. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి దెబ్బకు ఆర్థికరంగం కుదేలైన సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు లాక్‌డౌన్, కర్ఫ్యూల, నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రపంచలోని దాదాపు ప్రతీ దేశంలోనూ కరోనా మహమ్మారి ప్రవేశించింది. కానీ, ఈ ఆరు దేశాల్లోకి మాత్రం కరోనా ఎంటర్ కాలేకపోయింది. అక్కడ ఎలాంటి లాక్‌డౌన్‌లు అమలు చేయడం లేదు. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ దేశాలో ఏంటో…
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. అమెరికా వంటి దేశాల్లో కేసులు 8 లక్షల వరకూ వుండడం ఆందోళన కలిగించాయి. తాజాగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా వచ్చిపడుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా పసిఫిక్ దీవుల్లోని కొన్నిదేశాల్లో ఇప్పటిదాకా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ, ఒమిక్రాన్ పుణ్యమా అని వేరే దేశాల నుంచి వచ్చినవారితో అక్కడ తొలిసారి కేసులు నమోదయ్యాయి. దీంతో కిరిబాటి, సమోవ వంటి…
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ కారణంగా దేశంలో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఇక తమిళనాడులో రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. దీంతో అక్కడ నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైతం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను…