ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.