దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు…
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇందులో భాగంగా ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి.. ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్న, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.. ఆ తర్వాత కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి హాజరయ్యారు…
‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అవే డ్రాపింగ్’ పేరుతో యాపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 17…
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆరంభించింది. పాక్ 241 పరుగులకు ఆలౌటైంది హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్‌దిల్ షా (38) ఔటయ్యాడు. తొలుత పాకిస్థాన్ 47 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (47), సౌద్ షకీల్ (62) 104 పరుగులు జోడించారు.
ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.
Pawan Kalyan Varahi Declaration LIVE : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇది అధికారం చేపట్టిన తర్వాత తన మొదటి భారీ సభ. ఈ కీలకమైన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్‌ను ఆవిష్కరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జ్యోతిరావు పూలే సర్కిల్‌లో జరిగే సభను విజయవంతం చేసేందుకు జనసేన, కూటమి పార్టీ స్థానిక నేతలు సమన్వయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్…
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ పఠానియా గురువారం తీర్పు వెలువరించారు.