ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం
బిగ్బాస్ హౌస్ రెండు భాగాలుగా విభజించబడిందని ప్రకటించిన నాగార్జున ఒకటి మెయిన్ హౌస్ మరొకటి అవుట్ హౌస్ అని చెప్పుకొచ్చాడు. మెయిన్ హౌస్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ అవుట్ హౌస్ లో ఎలాంటి సౌకర్యాలు ఉండవని ప్రకటించాడు. అయితే అగ్నిపరీక్ష పాస్ అయ్యి లోపలికి వచ్చిన కామనర్స్ కి మెయిన్ హౌస్ లో ఓనర్స్ గా ఉండే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. ఇక సెలబ్రిటీ లందరూ ఇకమీదట అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని వారందరూ అవుట్హౌస్లో ఉండాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ముగిసింది.
ఇక కంటెస్టెంట్లు లోపలికి వెళ్లిపోయారు క్లోజ్ చేయాలనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి మరొక కంటెస్టెంట్ కి అవకాశం ఇవ్వాలని నాగార్జున అని కోరి మర్యాద మనీష్ ని ఎంపిక చేసింది.
హౌస్ లోపలికి 14వ కంటెస్టెంట్ గా కామనర్ ప్రియ ఈపూరు అలియాస్ ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది.
ఇక హౌస్ లోపలికి 13వ కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. గతంలో జయం సినిమాతో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి ఎన్నో సినిమాల్లో నటించాడు
హౌస్ లోపలికి వచ్చిన శ్రీజ సంజన, రాము రాథోడ్ ఇద్దరిలో ఒకరికి వారం మొత్తం బట్టలు ఉతకాల్సిన డ్యూటీ అప్పజెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె రాము రాథోడ్ బట్టలు ఉతకాల్సిందిగా సూచించింది.
హౌస్ లోకి నాలుగవ కామనర్గా దమ్ము శ్రీజ ఎంట్రీ ఇవ్వనుంది. స్టేజ్ మీదకు వచ్చిన నవదీప్ ఆమెను సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.
బిగ్బాస్ హౌస్ లోకి 11వ కంటెస్టెంట్ గా రాను బొంబాయికి రాను సాంగ్ సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు.
హౌస్ లోపలి సంజనా గల్రానీ ఎంట్రీ ఇవ్వనుంది . ఆమె బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .
హౌస్ లోపలికి వచ్చిన పవన్ చేత భరణి లేదా రీతు చౌదరి ఇద్దరిలో ఎవరో ఒకరికి కిచెన్ పాత్రల క్లీనింగ్ డ్యూటీ ఒక వారం ఇవ్వాలని కోరగా అతను రీతూ చౌదరికి ఇచ్చాడు. దీంతో ఒక వారం పాటు రీతు చౌదరి కిచెన్ లో పాత్రలు కడిగే డ్యూటీ చేయనుంది.
మూడవ కామనర్ గా హౌస్ లోకి డిమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లోకి ఇతను తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడు.
కాస్త హడావిడి తర్వాత భరణి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ బాక్స్ లో ఉన్నది ఒక లాకెట్ మాత్రమే అని చెప్పి నాగార్జున ఆడియన్స్ కి చూపించమనగా భరణి చైన్తో ఉన్న లాకెట్ తీసి చూపించాడు. లేడీ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్లేప్పుడు జువెలరీ అలో చేస్తారు కాబట్టి భరణికి కూడా అవకాశం కల్పించామని నాగార్జున చెప్పుకొచ్చాడు. అది ఎంత ఇంపార్టెంట్ అనేది హౌస్ లో డిస్కస్ చేస్తామని నాగార్జున ప్రకటించాడు.
బిగ్ బాస్ 9లోకి సీరియల్ నటి రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది .
భరణి ఎంట్రీ ఇస్తున్న సమయంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో పాటు ఒక బాక్స్ తీసుకొచ్చిన భరణి అది ఉంటేనే లోపలికి వెళ్తానన్నాడు కానీ దానికి బిగ్ బాస్ ఒప్పుకోలేదు. ఆ బాక్స్ లో ఏముందో బయటకు తీసి మెడలో ధరించి లేదా సీక్రెట్ బయటకు చెప్పి లోపలికి వెళ్లాలని చెప్పాడు. కానీ తను ఆ పని చేయలేనని చెప్పడంతో వెనక్కి వెళ్ళిపోవచ్చు అని సూచించారు. దీంతో భరణి వెనక్కి వెళ్ళిపోయాడు.
ఏడవ కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు భరణి శంకర్ ఎంట్రీ ఇచ్చాడు.
మాస్క్ మాన్ హరీష్ హౌస్ లోపలికి వచ్చాక నాగార్జున శ్రష్టి వర్మ లేదా ఇమ్మానుయేల్ ఇద్దరిలో ఒకరికి వారం మొత్తం హౌస్ క్లీనింగ్ డ్యూటీ ఇవ్వాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో ఇమ్మానుయేల్ మాట్లాడుతూ పెద్ద టాస్క్ కాస్త ఆలోచించి ఇవ్వమనే లోపు ఇమ్మానుయేల్ కి ఆ టాస్క్ ఇస్తున్నట్టు హరీష్ ప్రకటించాడు. దీంతో మొదటివారం హౌస్ మొత్తాన్ని క్లీన్ గా ఉంచాల్సిన బాధ్యత ఇమ్మానుయేల్ భుజాల మీద పడింది.
ఆరవ కంటెస్టెంట్ గా మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు
ఐదవ కంటెస్టెంట్ గా సినిమాటోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు
కామనర్స్ నుంచి సోల్జర్ పడాల పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు .
నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో పాపులర్ అయిన నటి ఫ్లోరా సైనీ ( ఆశా సైనీ )
సెకండ్ కంటెస్టెంట్ గా ఆశా/ఫ్లోరా సైనీ ఎంట్రీ ఇచ్చింది
‘ముద్దమందారం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ ముద్దుగుమ్మ తనూజ పుట్టస్వామి తన అసలు పేరుతో కంటే ముద్దమందారం పార్వతిగానే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించి మొదటి సీరియల్‌తోనే మంచి మార్కులు కొట్టేసింది.
మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన తనూజ తనూజ పుట్టస్వామి
కామనర్స్ 13 మందిని పేరుపేరునా పలకరించాడు నాగార్జున
అగ్నిపరీక్ష నుంచి 13 మంది ఫైనల్ .. వీరిలో ఐదుగురిని లోపలి పంపిస్తాం : నాగార్జున
ఈసారి రెండు హౌస్ లు ఉంటాయని చెప్పి నాగార్జున చేత రెండవ హౌస్ చూపించారు
హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ సూచనలతో మొత్తం హౌస్ అంతా తిరిగి చూపించాడు
ఈసారి డబుల్ హౌస్ తో డబుల్ జోష్.. అగ్నిపరీక్షతో కామనర్స్ కి అవకాశం.. సెలబ్రటీలు vs కామనర్స్ ఈ బిగ్ బాస్ సీజన్ 9