దేశంలో కరోనా కేసులు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా జరుగుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే అస్త్రం కావడంతో ఉత్తర్ప్రదేశ్ ఇటావా జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపించిన వాళ్లకే మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీచేసింది. మద్యం దుకాణాల వద్ద ప్రత్యేక నోటీసు బోర్డులు అంటించేలా చర్యలు చేపట్టింది. కరోనా టీకా వేయించుకున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని చూపించిన తర్వాతే అమ్ముతున్నామన్నారు.