తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ అమలు జరగబోతున్న సంగతి తెలిసిందే. 10 రోజులపాటు లాక్‌డౌన్ అమలులో ఉండబోతున్నది. రేపటి నుంచి లాక్‌డౌన్ కావడంతో మద్యం షాపుల వద్ద లిక్కర్ కోసం మందుబాబులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. ఒక్కసారిగా మందుబాబులు షాపుల వద్దకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. కరోనా నిబందనలు గాలికోదిలేశారు. భౌతికదూరం పాటించడంలేదు. ఎక్కడ మద్యం దొరకదో అని చెప్పి ఒక్కక్కరు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలు యధావిధిగా జరిగే అవకాశం ఉన్నది. కాసేసట్లో లాక్‌డౌన్‌కు సంబందించి మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నారు. ఈ మార్గదర్శకాల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఉంటుందా లేదా అన్నది తేలిపోతుంది.