Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌ని జనవరి 3న తమ ముందు హాజరుకావాలని కోరింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసుకి సంబంధించి ప్రశ్నించేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్ కు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ సమాన్లు సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు చాలా మంది అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు వేగవంతం చేసింది. ఈ కేసు సంబంధించిన వ్యక్తులను విచారిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణుల ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కవితను ఈడీ ప్రత్యేక బృందం ప్రశ్నిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని కేసీఆర్, కవిత ఇంటి ముందు భారీగా పోలీను మోహరించారు.