ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసుకి సంబంధించి ప్రశ్నించేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్ కు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇవాళ సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీబీఐ విచారణ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read : YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
ఒకవైపు కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. మరొవైపు ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నట్లు సీబీఐ చెబుతుంది. తాను అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీపరుడు ఎవరూ ఉండరని ఆయన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర ఏజెన్సీలు తమపై కోర్టుకు అబద్దాలు చెబుతున్నాయని అరెస్ట్ చేసిన వ్యక్తులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక కేసులో తెలంగాణకు పలువురు ప్రముఖులను ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పలుసార్లు విచారించింది. సీబీఐ సమన్లు అందుకున్న కేజ్రీవాల్ కూడా ఈ కేసులో నేరుగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయా వర్గాల్లో నెలకొంది. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఇలా విచారణకు హాజరుకావడంపై ఢిల్లీ అంతటా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read : Varuthini Ekadashi: వరూధిని ఏకాదశి రోజు ఈ స్తోత్రాలు వింటే ధన ప్రాప్తి సిద్ధిస్తుంది