దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ సమాన్లు సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ సమాన్లు పంపింది. విచారణకు రావాలని పేర్కొంది. మద్యం పాలసీ కేసులో సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. కోర్టులకు అబద్ధాలు చెబుతున్నారని, అరెస్టు చేసిన వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఎలాంటి తప్పు చేసినట్లు రుజువు కూడా లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో మాటల దాడికి దిగిన కేజ్రీవాల్.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. 14 ఫోన్‌లను ధ్వంసం చేశారని, అఫిడవిట్‌లలో కోర్టులకు అబద్ధాలు చెప్పారని అన్నారు. అనుమానితులను చిత్రహింసలకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేపు మీ కూతురు కాలేజీకి ఎలా వస్తుందో చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:Karnataka: బీజేపీలో అంతర్గత కలహాలు.. జగదీష్ షెట్టర్ నిర్ణయంపై ఉత్కంఠ
మద్యం కుంభకోణంలో సేకరించినట్లు వారు చెప్పుకునే అక్రమ సంపదలో ఒక్క పైసా కూడా ఏజెన్సీలు కనుగొనలేదని ముఖ్యమంత్రి అన్నారు. దాడుల్లో తమకు ఏమీ దొరకనప్పుడు, గోవా ఎన్నికల ప్రచారానికి డబ్బు చేరిందని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. దీనికి రుజువు ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. తమకు లభించిందని క్లెయిమ్ చేస్తున్న రూ. 100 కోట్లలో ఒక్క రూపాయి నాకు చూపించండి అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
“నేను సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీకి రూ.1,000 కోట్లు చెల్లించానని రుజువు లేకుండా చెబితే, మీరు అతన్ని అరెస్టు చేస్తారా?” ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అడిగారు. తాను అసత్య సాక్ష్యాలు,తప్పుడు సాక్ష్యాలు కోసం ఏజెన్సీలపై దావా వేస్తానని ప్రకటించాడు. రేపు విచారణకు హాజరవుతారని కేజ్రీవాల్ చెప్పారు.
We will file appropriate cases against CBI and ED officials for perjury and producing false evidence in courts
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 15, 2023
గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీ, రాజధానిలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వ నియంత్రణను నిలిపివేసి, ప్రైవేట్ రిటైలర్లకు అనుచిత ప్రయోజనాలను కల్పించిందనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ స్కామ్ లో కేజ్రీవాల్ ప్రభుత్వ అత్యున్నత స్థాయి ప్రమేయం ఉందని ఆరోపించారు. పాలసీలో ఫేవర్‌ల కోసం కోట్ల కిక్‌బ్యాక్‌లు చెల్లించినట్లు ఏజెన్సీ పేర్కొంది. గత ఏడాది గోవాలో తన పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ఖర్చలు చేశారని పేర్కొన్నాయి. ఈ కేసులో ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు.
Also Read:Asad Ahmed: ప్రయాగ్‌రాజ్‌లో అసద్ అహ్మద్ అంత్యక్రియలు.. తండ్రికి అనుమతి నిరాకరణ
కాగా, 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దేశాన్ని కదిలించి రాజకీయ జీవితం ప్రారంభించిన కేజ్రీవాల్‌కు.. ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలపై సమన్లు జారీ కావడం గమనార్హం. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హాదా వచ్చింది. ప్రధానమంత్రి మోడీ బిజెపికి ప్రధాన ప్రత్యామ్నాయాలలో ఒకటిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.