తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో దాదాపు 10 సినిమాలు ఓ అడవి దున్నను చుట్టుముట్టాయి. ఇంక తన పని అయిపోందనుకున్న దున్న.. గట్టిగా ధైర్యం తెచ్చుకున్నట్టుంది. సింహాలన్నీ చుట్టూ చేరి దాడికి ప్రయత్నిస్తున్నా.. ఆ దున్న మాత్రం దైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆ దున్న సింహాలనుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న నీటి కొలనులోకి దిగి వెళ్తుంది. సింహాలు నీటిలోకి రావు కదా.. అందుకే దైర్యంగా ఆ నీటిలోకి దిగి సింహాలనుంచి తప్పించుకుంది అడవి దున్న.
గుజరాత్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద్దు సింహాల దాడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎద్దును చూసి సింహాలు భయంతో పరుగు తీశాయి.
ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. మదర్స్ డే సందర్భంగా గిర్ నేషనల్ పార్క్ లో తను చిత్రీకరించిన సింహాల ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మదర్స్ డే సందర్భంగా నేను ఇటీవల గిర్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించిన ఈ మనోహరమైన ఫోటోలను పంచుకోవడం సముచితమని భావిస్తున్నాను.అమ్మ,అందమైన పిల్లలు ఒకరితో ఒకరు పంచుకునే బంధం కళ్లకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ కుమార్…
మా హీరో సింహం లాంటోడు.. చిరుత లాంటి కళ్లు.. సింహం లాంటి పొగరు అంటూ అభిమానులు తమ అభిమాన హీరోలను పొగడడం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక స్టార్ హీరో కొత్త సినిమా పోస్టర్ రావడం ఆలస్యం.. సింహాన్నో, పులినో పక్కనపెట్టి.. అడవికి రాజు సింహం.. ఇండస్ట్రీకి రాజు మా హీరో అంటూ ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లో సైతం హీరోలను అదే విధంగా ఎలివేట్ చేస్తున్నారు.…
కరోనా కేసులు ప్రపంచ దేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, గతంలో కరోనా మహమ్మారి మనుషులతో పాటుగా జంతువులకు కూడా సోకింది. ఇప్పుడు మరలా జంతువులకు సోకుతున్నది. తాజాగా సింగపూర్‌లోని నైట్ సఫారీ జూలోని నాలుగు సింహాలకు కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా ఈ సింహాలకు జలుబు తుమ్ములతో కూడిన ఫ్లూ సోకింది. నాలుగు సింహాలు నీరసించిపోయి కనిపించాయని జూ నిర్వహకులు పేర్కొన్నారు. నైట్ జూ సిబ్బంది ముగ్గురికి కరోనా సోకడంతో…
సింహాల వేట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. టార్గెట్ చేసింది అంటే వేట చిక్కాల్సిందే. ఓ జింకను వేటాడిన సింహం దానిని పట్టుకొని చెట్టు ఎక్కి కూర్చుంది. అయితే, ఈ జింక కోసం మరో ఐదు సింహాలు కూడా చెట్టు ఎక్కాయి. ఒకటి జింక మెడ భాగం గట్టిగా పట్టుకుంటే, మరోకటి దాని కాళ్లు పట్టుకుంది. అంతలో మరో సింహం చెట్టు ఎక్కి దాని పొట్టభాగం పట్టుకుంది. అయితే, అన్ని సింహాలు జింక కోసం పోటీ పడటంతో…
సింహాలను చూడాలని అందరికీ ఉంటుంది. జూకి వెళ్లి చూస్తాం. అయితే, అది ఎక్కడో దూరంగా ఉంటుంది. దానిని ఫొటోలు తీసుకొని సంతోషిస్తాం. దగ్గరగా చూడాలంటే సింహాల సంరక్షణా కేంద్రాలకు వెళ్లాల్సిందే. అక్కడ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి చూసిస్తారు. అయితే, ఎక్కువసేపు అక్కడ ఉండటం కుదరని పని. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. అక్కడ అనేక సింహాల సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. అందులో దక్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంరక్షణా కేంద్రం చాలా ప్రత్యేకమైనది. ఆ కేంద్రంలో భయంకరమైన సింహాలు…