Viral : సింహాలను తరిమికొట్టిన ఎద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో నెట్టింట ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతిరోజు లక్షల వీడియోలు నెట్టింట అప్ లోడ్ అవుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇలాంటి వీడియోలు ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఈ వీడియోలను నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లైక్ కొడుతూ వైరల్ చేస్తుంటారు.
Also Read : Dimple Hayathi: నేను డీసీపీని ఇబ్బంది పెట్టలేదు.. అంతపెద్ద ఆఫీసర్‌ను నేనేం చేస్తాను
Also Read
అయితే.. ఇక్కడ కూడా ఇలాంటి వీడియో ఒకటి చెక్కర్లు కొడుతుంది. సాధారణంగా అడవికి రారాజు సింహం అని చెబుతుంటారు. ఎందుకంటే.. ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని నిర్ణయించుకుంటే చాలు ఇక ఆ జంతువు సింహానికి ఆహారం అయిపోవాల్సిందే. అందుకే ఏ జంతువు కూడా సింహం దరిదాపుల్లోకి వెళ్లడానికి ధైర్యం చేయదు.. కేవలం చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, జింకలు, జిరాఫీలను కూడా సింహాలు వేంటాడి వేటాడి తమ ఆకలిని తీర్చుకుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఒక ఎద్దును చూసి సింహాలు పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : Reliance Jio: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్‌పై 10 జీబీ డేటా..
గుజరాత్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద్దు సింహాల దాడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎద్దును చూసి సింహాలు భయంతో పరుగు తీశాయి. ఏకంగా ఐదు సింహాలు ఎదురుపడినా.. ఆ ఎద్దు ఏమాత్రం భయపడకుండా వాటిని తరిమి తరిమి పరిగెత్తించింది. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. అంతేకాదు.. దూరంగా ఆరుబయట నిద్రస్తున్న ఓ వ్యక్తి కూడా తన మొబైల్ ఫోన్ లో ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు. గిర్ అభయారణ్యం సమీపంలో ఉండటంతో.. సింహాలు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్ వైరల్ గా మారింది.
https://twitter.com/HasnaZarooriHai/status/1658868193971277825
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!