తెలంగాణలో న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిన్న ఓ న్యాయవాది అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, తమ రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు.
Live-in Relationship: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చింది. పెద్దలు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తీర్పును జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ ఇచ్చారు. పిటిషనర్లిద్దరికీ 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇకపై బయటి వారి జోక్యం నుంచి ఈ హక్కును కాపాడుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ,…
Husbands Legal Rights: ఒక అబ్బాయి, అమ్మాయి వివాహం చేసుకున్నప్పుడు.. అది వారికి, తమ కుటుంబాలకు చాలా సంతోషకరమైన క్షణం. భారత దేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. చాలా మంది జంటలు తమ సంబంధాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు.