Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ నిత్య పెళ్లికొడుకు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. తాను పోలీసు అధికారినని చెప్పుకుంటూ ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు.
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి పట్ల కన్న తండ్రే కసాయి వాడయ్యాడు. ముక్కు పచ్చలారని పసి కందును తీసుకెళ్లి బలవంతంగా ముసలోడికి కట్టబెడ్డాడు.
Highcourt Telangana : హైదరాబాద్ అంబర్ పేట్‌లోని బతుకమ్మ కుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వమిదేనని స్పష్టం చేసింది. ఈ స్థలాన్ని తమదని, బతుకమ్మ కుంటపై హైడ్రా చర్యలకు స్టే విధించమని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు 2025 జనవరి 7వ తేదీన తుది తీర్పు ఇచ్చింది. Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్’లో టాలీవుడ్ స్టార్…
చలికాలంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే హస్తిన పాలిటిక్స్ వేడెక్కాయి. అధికార పార్టీ-బీజేపీ మధ్య సై అంటే సై అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.
మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.
పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు.
Raghurama Krishnaraju : సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, ఆయన పాపం పండిందన్నారు. తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారు అని తెలిసిందని, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు కుట్ర చేసింది పీవీసునీల్ కుమార్ అని ఆయన అన్నారు.…
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు ఇంకా అనుమానాలు తీరడం లేదు. ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కాంగ్రెస్‌దే అధికారం అంటూ ఊదరగొట్టాయి. కానీ ఫలితాలు వెలువడే సరికి అంతా రివర్స్ అయింది. ఊహించని విధంగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది.
విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ అధికారులపై, సిబ్బంది పై దాడి చేయడం, విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ హెచ్చరించారు. నిన్న (గురువారం) బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీ నగర్ లో జరిగిన సంఘటనలో గాయపడిన సిబ్బంది గణేష్, శ్రీకాంత్ మరియు భాస్కర్లను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సర్కిల్ సూపెరింటెండింగ్…