NIA, IT raids across the country: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఐటీ డిపార్ట్మెంట్లు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్- టెర్రర్ లింకులపై ఎన్ఐఏ విస్తృతంగా దాడులు చేస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని 72 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ నుంచి సరఫరా చేసిన వస్తువులను…
ఇటీవల సల్మాన్ ఖాన్‌కు తనతో పాటు తండ్రి సమీర్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే! ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందిన వారే ఆ లేఖ పంపినట్టు పోలీసు విచారణలో తేలడంతో.. అతడ్ని కూడా ప్రశ్నిస్తున్నారు. తొలుత ఆ బెదిరింపు లేఖతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పిన బిష్ణోయ్.. తాజా విచారణలో మాత్రం తమ వర్గం ఎప్పటికీ సల్మాన్‌ని క్షమించదని బాంబ్ పేల్చాడు. ‘‘కృష్ణ జింత హత్య విషయంలో…
సల్మాన్ ఖాన్ బెదిరింపు లేఖ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బడా వ్యాపారవేత్తలు, నటుల నుంచి డబ్బు వసూలు చేయడానికే లేఖ పంపినట్లు మహారాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మరణించిన కొద్ది రోజులకే, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రికి హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్ తండ్రి స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాగింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఓ బెంచీ…
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుల లేఖ కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు. నటుడు సల్మాన్ తండ్రి సలీం ఖాన్‌కు లేఖను అందించిన వ్యక్తులను ముంబై పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నిందితుడు సిద్ధేష్ హిరామన్ కాంబ్లే అలియాస్ మహాకల్‌ను విచారించిన సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. బిష్ణోయ్ సహాయకుడు విక్రమ్ బరాద్ లేఖను సలీంఖాన్‌కు ఇచ్చినట్లు నిందితుడు మహాకల్ వెల్లడించాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్…
ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల లేఖ వచ్చిన విషయం తెలిసిందే! పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాని ఎలా కాల్చి చంపామో.. అలాగే నిన్ను, నీ తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ అతనికి లేఖ వచ్చింది. ఈ లేఖ అందుకున్న వెంటనే సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనికి భద్రత పెంచడంతో పాటు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇన్నిరోజులు ఈ లేఖపై స్పందించని సల్మాన్.. తాజాగా ఓపెన్ అయ్యాడు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు…
కొన్ని రోజుల క్రితం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే! ఆయన తన స్నేహితులతో కలిసి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆ సింగర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా అతడ్ని చంపినట్టే, నిన్ను కూడా చంపుతామంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాదు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను కూడా చంపుతామంటూ ఆ లేఖలో…
పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య ప్రస్తుతం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిద్దూ మూస్ వాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గేయ రచయితగా కెరీర్ ఆరంభించి లైసెన్స్ అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత జీ వ్యాగన్ అనే పాటతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన డెవిల్ లెజెండ్ జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్జ్ జాట్ దా ముకాబులా…