Lawrence Bishnoi Revealed That Salman Khan Offered Huge Money When He Threatens Him: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే! సిద్దూని చంపినట్లే.. నిన్ను కూడా హత్య చేస్తామంటూ ఆ లేఖలో దుండగులు పేర్కొన్నారు. తొలుత ఈ లేఖ ఎవరు పంపించారన్న విషయంపై స్పష్టత లేకపోయినా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి, దీని వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోవ్ హస్తం ఉందని తేల్చారు. గతంలో కూడా ఈ గ్యాంగ్‌స్టర్.. కృష్ణజింకలను వేటాడినందుకు గాను సల్మాన్‌ను చంపుతానని బెదిరించాడు. ఇప్పుడు మళ్లీ తన ముఠా చేత బెదిరింపు లేఖ పంపించిన నేపథ్యంలో.. పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి మరింత సమాచారం లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు.
Student Suicide: మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థిని ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో ఘటన
‘‘కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ని చంపేందుకు నేను రూ.4 లక్షలు పెట్టి ఓ తుపాకీ కొన్నాను. ఆయన మా సమాజాన్ని అవమానించాడు. అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాం. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాం. కృష్ణ జింకల్ని వేటాడిన వ్యవహారంపై సల్మాన్‌పై ఇప్పటికీ కేసు ఉంది. కానీ, ఇప్పటిదాకా సల్మాన్ క్షమాపణలు చెప్పలేదు. మేము సల్మాన్‌ని చంపుతామని బెదిరించినప్పుడు.. ఆయన మాకు భారీగా డబ్బులు ఆఫర్ చేశాడు. కానీ, మేము తిరస్కరించాం. ఇప్పటికీ కూడా సల్మాన్ క్షమాపణలు చెప్పకపోతే.. తీవ్ర పరిణామాలుంటాయి. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. సల్మాన్‌పై నాకు చిన్నప్పటి నుంచే చాలా కోపం ఉంది. ఆయన అహాన్ని అతి త్వరలోనో లేదా ఇంకొన్నాళ్లలోనే దెబ్బతీస్తాం. మా పవిత్ర దేవాలయానికి వచ్చి, సల్మాన్ క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మా సమాజం క్షమిస్తే.. నేను అతని జోలికి వెళ్లను’’ అంటూ లారెన్స్ బిష్ణోవ్ చెప్పుకొచ్చాడు.
Boy Fell In Borewell: రెస్క్యూ ప్రయత్నాలు విఫలం.. బోరుబావిలో పడిన పిల్లాడి మృతి