పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా మమత.. కఠినమైన కేంద్ర చట్టం, అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలను పాల్పడి నిందితులను శిక్షించాలని.. నిర్ణీత గడువులోపు కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదలైంది. చాలా మంది సంపన్నుల ర్యాంకింగ్‌లో మార్పు వచ్చింది. అయితే వారి సంపదలో భారీ పెరుగుదలతో అగ్రస్థానానికి చేరుకున్న చాలా మంది పేర్లు ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ముంబై, పాల్ఘర్‌లలో పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2024 ప్రారంభ సెషన్‌కు ప్రధాని హాజరవుతారు.
గుజరాత్‌లో సౌరాష్ట్ర నుంచి కచ్ వరకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వడోదర నుంచి రాజ్‌కోట్ వరకు, జామ్‌నగర్ నుంచి ఖేడా వరకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
జో రూట్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం చురుకైన ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఢిల్లీలోని ఐదుగురు కౌన్సిలర్లలో ఒకరైన కౌన్సిలర్ రామచంద్ర ఈరోజు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మూడు రోజుల క్రితం ఆప్ కౌన్సిలర్‌లను తమ పార్టీలో చేర్చుకోవాలని మాయ చేసిన బీజేపీకి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ మినహా ఎవరినీ అరెస్టు చేయలేదు.