చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు…
పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రీలో భారీస్థాయిలో కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు చిక్కుకుపోయాయి. ఊపిరి ఆడనీయలేనంత దట్టంగా కార్లపై మంచు పేరుకుపోయింది. దీంతో ఆయా వాహనాల్లో ఉన్న వారిలో 22 మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వందలాది వాహనాలను మంచు నుంచి వెలికితీశామని.. వెయ్యికిపైగా వాహనాలు ఇంకా మంచులోనే కూరుకునిపోయి ఉన్నట్లు వారు వివరించారు. Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్..…
సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని… ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. Read Also: మందు బాటిల్ ముందేసుకుని…
★ నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం★ ఏపీ: కరోనా దృష్ట్యా నేడు మంగళగిరిలో జరగాల్సిన జనసేన కార్యవర్గ సమావేశం వాయిదా★ అమరావతి: నేడు జరగాల్సిన ఉద్యోగ జేఏసీ సమావేశం వాయిదా… తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసిన ఉద్యోగ జేఏసీ★ హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ★ నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం: వాతావరణశాఖ★ హైదరాబాద్: నేడు హీరో కృష్ణ…
2021 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి సత్తా చాటిన క్రికెటర్లలో హర్షల్ పటేల్ ఒకడు. ఈ సీజన్‌లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా అతడు నిలిచాడు. అయినా ఆర్‌సీబీ జట్టు హర్షల్ పటేల్‌ను రిటైన్ చేసుకోలేదు. కేవలం కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకుంది. తనను రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలపై హర్షల్ స్పందించాడు. 2022 రిటెన్షన్‌లో తన పేరు ఉండదని తనకు ముందే…
ప్రధాని నరేంద్ర మోదీకి మెదక్ జిల్లాకు చెందిన 200 మంది చిన్నారులు మూకుమ్మడిగా ఉత్తరాలు రాశారు. వివరాల్లోకి వెళ్తే… తాము చదవుకునేందుకు తమ జిల్లాలో నవోదయ పాఠశాల, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని చిన్నారులు ప్రధాని మోదీని కోరారు. తమ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉత్తరాలలో పేర్కొన్నారు. నవోదయ పాఠశాలలు ఉంటే తమ జీవితాలు బాగుపడుతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే.. కేవలం 10…
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. Read Also: రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో కాగా రామకృష్ణ సెల్ఫీ…
ప్రస్తుతం కోవిడ్ అనే పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. 2020 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తిట్టుకునే పేర్లలో కచ్చితంగా కోవిడ్ ఉండి తీరుతుంది. కానీ కోవిడ్ అనే పేరు మనుషులకు ఉంటుందని మనం ఊహించగలమా? అయితే మన ఇండియాలో కోవిడ్ అనే పేరు గల మనిషి ఉన్నాడండోయ్. అతడి పూర్తి పేరు కోవిడ్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబై ఐఐటీలో చదువుకున్న కోవిడ్ కపూర్ ప్రస్తుతం బెంగళూరులోని ట్రావెల్ కంపెనీ హాలిడిఫై.కామ్ సహ…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశంలో రోజుకు దాదాపు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈసారి బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని అమెరికా సీడీసీ వెల్లడించింది. ముఖ్యంగా బాధితుల్లో ఐదేళ్లు లోపు చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య పెరుగుతోందంటూ అమెరికా సీడీసీ డేటాను విడుదల చేసింది. 14 రాష్ట్రాల్లోని…
జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ‘వన్ సైడ్ లవ్’ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచీ జనం లవ్ చేయరు బాబూ. నిన్ను లవ్ చేసేది పచ్చ…