టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా…
తెలుగు రాష్ట్రాలలో పుల్లారెడ్డి స్వీట్స్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. అయితే పుల్లారెడ్డి స్వీట్ షాపుకు హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. రూ.25వేలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల శంషాబాద్‌లోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్‌లో కొంతమంది కస్టమర్లు స్వీట్లు కొనుగోలు చేశారు. Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు అయితే వారు కొనుగోలు చేసిన మిఠాయిలు పాచిపోయి ఉండటంతో కస్టమర్లు…
కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరు కావడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని…
తెలంగాణలో ఇంటర్ పరీక్షలను మే 2 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తూ వచ్చిన ఇంటర్ బోర్డు.. కరోనా కారణంగా ఆఫ్‌లైన్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం, థర్డ్ వేవ్ దృష్ట్యా మే నెలలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు మే 2న పరీక్షలను ప్రారంభించి 20వ తేదీకి పూర్తయ్యేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. మరోవైపు ఇటీవల ఇంటర్ ఫస్టియర్‌లో 2.35 లక్షల మంది విద్యార్థులు తప్పగా… ప్రభుత్వం…
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈనెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధన ఆసక్తి రేపుతోంది. ఇక నుంచి బౌలింగ్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే మైదానంలో 30 గజాల సర్కిల్ బయట ఉండే ఫీల్డర్‌లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. స్లో ఓవర్ రేటుకు పడే జరిమానాకు ఇది అదనం…
ఏపీలోని కడప జిల్లాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. నేషనల్ వాటర్ అవార్డ్స్-2020లో భాగంగా మొత్తం 11 విభిన్న విభాగాల్లో 57 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కడప జిల్లాకే అవార్డు వచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం ఈ అవార్డులను ప్రకటించారు. దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా… ఏపీలోని కడప జిల్లాకు రెండో స్థానం దక్కింది. రాష్ట్రాల విభాగంలో ఉత్తరప్రదేశ్,…
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న A2 నిందితుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అరెస్టును జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం శనివారం నాడు కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. Read…
★ చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు మూడో రోజు చంద్రబాబు పర్యటన… నేడు శాంతిపురం మండలంలో పర్యటించనున్న చంద్రబాబు★ అమరావతి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మౌన దీక్షలు… పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రతపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీ విగ్రహాల వద్ద బీజేపీ నేత మౌన దీక్ష★ ఏపీలో నేడు రైతు సమస్యలపై టీడీపీ నిరసనలు… ‘విత్తనం నుంచి విక్రయం దాకా దగాపడ్డ రైతన్న’ పేరుతో నిరసనలు చేపట్టనున్న టీడీపీ.. నిరసనల్లో పాల్గొననున్న తెలుగు రైతు…
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ… వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని చేరింది. తొలి, రెండో డోసు కలిపి 150 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘కొత్త ఏడాదిలో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలు, కంపెనీలు, హెల్త్ కేర్ ఉద్యోగులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి కష్టంతో ఈ మైలురాయిని సాధించాం. సున్నా నుంచి ఈ స్థాయికి…
గతంలో యూఎస్ కళాకారుడు రెండు చేతులతో ఒకేసారి రెండు బొమ్మలు గీయడం చూసి భారతదేశానికి చెందిన నురూల్ హాసన్ ఎంతో స్ఫూర్తి పొందాడు. దీంతో ఏకంగా యూఎస్ కళాకారుడికే ఛాలెంజ్ విసిరి ఒకే చేత్తో ఏకకాలంలో నాలుగు రకాల బొమ్మలు గీసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యస్వంత్ అందరినీ అబ్బురపరిచే విధంగా తనదైన రీతిలో రెండు చేతులు, రెండు కాళ్ళతో ఏకకాలంలో మొత్తం 12 బొమ్మల్ని గీసి వారెవ్వా…