భారత్‌లో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 102 నుంచి 142కి పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021 నాటికి భారత్‌లో 142 మంది బిలియనీర్లు ఉండగా… వీరి దగ్గర ఉన్న ఉమ్మడి సంపద విలువ 719 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీలో 53 లక్షల కోట్లు అన్నమాట. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద…
తెలంగాణ పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కరోనా బారిన పడుతుండటం బాధాకరమని చెప్పాలి. కరోనా థర్డ్ వేవ్‌లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు. Read Also: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా…
కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను అదృష్టం లాటరీ రూపంలో వరించింది. దీంతో సదరు పెయింటర్ లాటరీలో ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… కొట్టాయం ప్రాంతానికి చెందిన సదానందన్ అనే వ్యక్తి 50 ఏళ్లుగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బతకడానికి అనేక అప్పులు చేసిన క్రమంలో వాటిని తీర్చేందుకు ఓ లాటరీ టిక్కెట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో క్రిస్మస్-న్యూఇయర్ సందర్భంగా కొట్టాయంలోని బెంజ్ లాటరీస్ ఏజెన్సీకి చెందిన లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. లాటరీ విజేతలను ప్రకటించడానికి…
సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఫైర్ సిబ్బంది నుంచి ప్రమాదంపై పలు వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. క్లబ్‌కు సంబంధించిన 50 వేల చదరపు అడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్‌తో పాటు విలువైన మద్యం, నగేసిలు, ప్రాచీన అరుదైన ఫర్నీచర్ కాల్‌నైట్ బార్ బంగ్లా కిచెన్,…
పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈనెల 24న ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సుమారు రెండేళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు డీఎస్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశం కావడంతో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది. Read Also: 15 ఏళ్ళ నాటి నిర్లక్ష్యం.. కానరాని పరిష్కారం 2015లో బంగారు తెలంగాణ లక్ష్యంగా డీఎస్…
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో విషాదం నెలకొంది. గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండగను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చే ముందు అక్కడున్నవారంతా మద్యం సేవించారు. అనంతరం పొట్టేలును బలిచ్చే క్రమంలో 35 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు. Read Also: అకాల వర్షం…అన్నదాతకు అపారనష్టం అయితే మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలుకు బదులుగా…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో దర్శనానికి ఆంక్షలు విధిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. స్వామి, అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం ఉందన్నారు. స్పర్శదర్శనం, అంతరాలయ దర్శనాలు, గర్భాలయ అభిషేకాలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. గతంలో టికెట్లు పొందినవారికి గర్భాలయ అభిషేకాలు పునః ప్రారంభం తరువాత అవకాశం కల్పిస్తామన్నారు. Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు అటు ఆలయంలో తీర్థం, ఉచిత ప్రసాద…
హైదరాబాద్ నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో విషాదం నెలకొంది. చదువుకోమని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ సీ బ్లాక్ 14వ ఫ్లోర్‌లో అమిత్ కుటుంబం నివాసం ఉంటోంది. అమిత్ కుమారుడు అద్వైత్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అల్లరి చేస్తున్న విద్యార్థి అద్వైత్‌ను తండ్రి మందలించాడు. చదువుకోమని గట్టిగా అరిచాడు. దీంతో మనస్తాపం చెందిన అద్వైత్… 14వ…
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఇండియా ఓపెన్ 2022లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించాడు. లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత పురుష ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను…
బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో సంక్రాంతి పండగ సందర్భంగా కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. శనివారం ఆరుగురు మరణించగా… ఆదివారం మరో ఐదుగురు మరణించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండటం గమనార్హం. 2016 నుంచి బీహార్‌లో మద్యపాన నిషేధం ఉండగా.. గత రెండు నెలల వ్యవధిలోనే కల్తీ మద్యానికి అలవాటు పడి…