నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రఘురామ ఆరోపించడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గుడ్డ కాల్చి మొహాన పడేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడని రఘురామను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కూర్చుని తనను చంపేస్తారని ఏడుపు మొదలు పెట్టాడని.. నర్సాపురం ప్రజలకు తన మొహం చూపించలేకే ఇలా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడని…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు రెండు లక్షల పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో విస్తృతంగా చర్చిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు…
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు జరిగిన జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.…
ఇటీవల ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో గ్రామ, వార్డు సచివాలయాల మహిళలను భాగస్వామ్యం చేస్తూ అనేక వరాలు కురిపించిన సీఎం జగన్‌కు చిత్తూరు జిల్లా మహిళలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేశారు. Read Also: కోహ్లీ ప్రకటనపై స్పందించిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఈ మేరకు చిత్తూరు పట్టణ పరిధిలో విధులు నిర్వహిస్తున్న…
సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయం. పిల్లలతో సహా పెద్దలు కూడా పండగ సందర్భంగా సరదా పడి గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే సంక్రాంతి పండగ ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. చాలా కాలంగా గాలిపటాలకు వాడే మాంజా చాలా ప్రమాదకరమైందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో మాంజా చుట్టుకుని ఆకాశంలోని పక్షులు మృత్యువాతపడిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా మాంజా చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం మాత్రం గమనార్హం. Read Also: సీఈసీ కీలక…
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఏడేళ్లుగా తాను టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించానని.. ప్రస్తుతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏడేళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా జట్టుకోసం సర్వశక్తులు ధారపోశానని… ఎంతో నిజాయతీగా వ్యవహరించానని కోహ్లీ తెలిపాడు. ప్రతి దానికి ఏదో…
త్వరలో దేశంలోని పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఒకపక్క కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో ర్యాలీలు, రోడ్ షోలపై ఎన్నికల కమిషన్ నిషేధం పొడిగించింది. గతంలో ఈనెల 15 వరకు నిషేధం విధించగా.. తాజాగా ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని ఈనెల 22 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం నాటి…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులనే స్కూళ్లలోకి అనుమతిస్తామని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఈ మేరకు 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Read Also: పంది గుండెతో మొదటి ప్రయోగం మనవాడిదే… కానీ! కరోనా కారణంగా ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది.…
ఇండియా ఓపెన్-2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మలేషియా షట్లర్ జీయాంగ్‌పై భారత షట్లర్ లక్ష్యసేన్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడిపోయినా ఆ తర్వాత రెండు, మూడు సెట్లలో సాధికారికంగా ఆడి లక్ష్యసేన్ గెలుపొందాడు. జీయాంగ్‌పై 19-21, 21-16, 21-12 స్కోరు తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు. కాగా టైటిల్‌పోరులో సింగపూర్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్ కియాన్యూతో లక్ష్యసేన్ తలపడనున్నాడు. లక్ష్యసేన్ ఉత్తరాఖండ్‌కు…
ముంబై: టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది. Read Also: వివాదంలో విరాట్…