ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని…
రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులతో రష్యా బలగాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ శవాల గుట్టలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,500 మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరిస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్‌కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. రష్యా దాడులు…
ఏపీలో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. 9న సాధారణ బడ్జెట్‌పై చర్చ జరిగింది. అలాగే తర్వాతి నాలుగు రోజుల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. మొత్తంగా 37 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈరోజు చివరి రోజు కాబట్టి.. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనుంది. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. ఎఫ్ఆర్ఎంబీ,…
★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్★ తిరుమల: నేడు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో మూడో రోజు.. ఈరోజు తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడు మలయప్పస్వామి★ నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు వ్యాట్ సవరణ బిల్లు… నేటితో ముగియనున్న బడ్జెట్‌పై చర్చ.. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ప్రతిపాదనపై సమాధానం చెప్పనున్న సీఎం జగన్★ నేటితో ముగియనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. నేడు…
Karnataka High Court Going Verdict Tomorrow on Hijab Row Issue. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హిజాబ్ వివాదంపై క్లారిటీ రానుంది. తరగతులకు హిజాబ్‌తో రావద్దంటూ ఓ విద్యా సంస్థ ఇచ్చిన ఆదేశంతో రేగిన ఈ వివాదం కర్ణాటకను అల్లకల్లోలానికి గురి చేసింది. కేవలం ఒకే ఒక్క విద్యా సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదముందంటూ జనం భయాందోళనలకు గురయ్యారు. దీంతో దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు తొలి రెండు చిత్రాలు ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని గుర్తింపు నిచ్చాయి. ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ కమర్షియల్ గానూ చక్కని విజయాన్ని అందుకుంది. కానీ మూడో సినిమా ‘సెబాస్టియన్’ మాత్రం కిరణ్ కు తీవ్ర నిరాశను కలిగించింది. చిత్రం ఏమంటే… ఈ సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండానే అతనితో అగ్ర నిర్మాణ సంస్థలు ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నాయి. అందులో ఒకటి అల్లు అరవింద్ సమర్పణలో…
Hero Vaibhav New Movie Buffoon Trailer Released. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ తెలుగులో కొన్ని చిత్రాలలో హీరోగా నటించాడు. అయితే… ఇక్కడ కంటే కోలీవుడ్ లోనే అతనికి కలిసొచ్చింది. అక్కడ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు చేశాడు. డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించాడు. తాజాగా అతను హీరోగా ‘బఫూన్’ సినిమా తెరకెక్కుతోంది. సముద్రతీరంలో సాగే స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకు…
మెగాస్టార్ తెర మీద కనిపిస్తే… మిగిలిన తారలంతా వెలవెలపోవాల్సిందే! చిరంజీవి కోసమే సినిమా థియేటర్లకు వెళ్ళిన ఆ రోజులను తలుచుకుని మెగాభిమానులు ఇప్పటికీ ఆనందపడుతూ ఉంటారు. ఆయన పక్కన ఎవరు హీరోయిన్, విలన్ అనే దానికి వారు అప్పట్లో ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. చిరంజీవి మేనరిజమ్స్, స్టైలిష్ స్టెప్స్, సూపర్ ఫైటింగ్స్ కోసమే సినిమాలు చూసేవారు. అయితే… ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత మెగాస్టార్ అయినా పక్కన కాస్తంత మాస్ మసాలా దట్టించే హీరోయిన్ ఉండాల్సిందే! అభిమానుల…
Tax Free on The Kashmir Files Movie at Karnataka Also. అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవిజోషి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కంటే ఆదివారానికి మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూళ్ళు సాధించింది. మొత్తం మీద వీకెండ్ లో ఈ మూవీకి రూ. 31.6 కోట్ల…