BJP MLA Etela Rajender Made Sensational Comments. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీజేపీ మీద ఉన్న కోపాన్ని రైతుల మీద చూపెడుతున్నారని, ధాన్యం సేకరణకు డబ్బులన్ని కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీగా మాత్రమే పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం రంగంలో దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదు దశాబ్దాలుగా కొనసాగుతుందని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాక…
ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త అందించింది. ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం 25 శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది. దీంతో రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లను క్రీడాభిమానులకు స్వయంగా వీక్షించే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మార్చి 23 మధ్యాహ్నం నుంచి టిక్కెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా ఐపీఎల్ 15వ సీజన్‌లో…
Telangana Energy Minister Jagadish Reddy About Paddy Procurement. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం వెనకబాటుకు గురైందని, బీజేపీ పాలనలో దేశం తిరోగమనం చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన…
ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్‌లకు అనుమతి ఇచ్చారని.. ఈ బ్రాండ్‌లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఆరోపించారు. 2019 తర్వాత ఏపీలో ఒక్క మద్యం బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు లేనే లేవని, ఆయా బ్రాండ్లు ఉన్నట్లు సోషల్…
TRS MLC TATA Madhu Fired On Telangana BJP Leaders. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లు పరిస్థితి ఉంది. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తూంటే.. మరోవైపు టీఆర్‌ఎస్ నేతలపై బీజేపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించిస్తున్నారు. అయితే ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై దశల వారి ఉద్యమాలు చేపడుతున్నామన్నారు.…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గతంలో…
Telangana State ERC Green Signal to Electricity Bill Hike. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై పెనుభారం మోపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వంటనూనె ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ప్రజలు నడ్డి విరయడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు తెలంగాణలో 14 శాతం విద్యుత్ ఛార్జీల పెంచుతున్నట్లు…
Telangana Health Minister Harish Rao Fired on BJP and Congress Leaders. సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్‌పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్‌రావు శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15కోట్లతో 18కిమీ మేర ఈ గ్రామం మీదుగా డబుల్ లైన్ రోడ్ పనులకు శంఖు స్థాపన చేశామని ఆయన అన్నారు. మండే ఎండ కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతో చెరువులు…
ప్రముఖ టూత్‌పేస్ట్ సెన్సోడైన్ కంపెనీకి సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ టూత్‌పేస్ట్ కంపెనీ ప్రకటన ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. వారం రోజుల్లో ఈ టూత్‌పేస్ట్‌కు సంబంధించిన యాడ్‌ను నిలిపివేయాలని కంపెనీని సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సెన్సోడైన్ కంపెనీకి రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. టీవీల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై ప్రసారమవుతున్న సెన్సోడైన్ ప్రకటనలను సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సుమోటోగా స్వీకరించింది. ప్రపంచ…
Former MP Ravindra Naik Fired on TRS Government. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్ల విషయంలో సీఎం కేసీఆర్ గిజనులను మోసం చేశాడని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం కేసిఆర్ తన గూండాలను పంపి బీజేపీ కార్యాలయం పై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని ఆయన…