Telangana State ERC Green Signal to Electricity Bill Hike.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై పెనుభారం మోపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వంటనూనె ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ప్రజలు నడ్డి విరయడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు తెలంగాణలో 14 శాతం విద్యుత్ ఛార్జీల పెంచుతున్నట్లు ప్రకటించింది. డొమెస్టిక్ పై 40 నుంచి 50 పైసల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర కేటగిరీల పై యూనిట్ టు రూపాయి చొప్పున పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
డిస్కంలు 19 శాతం విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరగా… 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ అనుమతినిచ్చింది. ఇక దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ చార్జీల పెంపు కే మొగ్గు చూపితే… తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల పై భారం పడనుంది.