జగన్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఇవాళ కూడా సభలో మద్యం పాలసీపై అసత్యాలు చెప్పి జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలను కించపరిచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సభలో సీఎంకు వైసీపీ ఎమ్మెల్యేలు చేసే భజన చూడలేకే తమ సభ్యులు చిడతలు వాయించారని తెలిపారు. పాలసీని మార్చి దుకాణాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా 10 దుకాణాల్లో మద్యం శాంపిల్స్ తీసి న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని…
Another Program at TSRTC. టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఆర్టీసీని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారు. కొత్తకొత్త ప్రయోగాలతో మునుపెన్నడూ లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలతో టీఎస్ఆర్టీసీ మమేకం చేసేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టీవ్‌గా ఉంటూ.. ఆర్టీసీకి సంబంధించిన ఎవైనా సమస్యలు, సలహాలు ఇచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న.. తెలంగాణాకే తలమానికమైన సమక్క-సారక్క జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటివరకు చేర్చే బాధ్యతను…
వేసవికాలం వచ్చిదంటే భానుడి భగభగకు ప్రజలు చెమటలు కక్కుతూ.. పనికి వెళ్లే పని.. ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు ఆఫీసల బాట పడుతుంటారు. అయితే ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండాకాలం ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎండతీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో ఉన్న పాత కూలర్లను, పనిచేయని ఏసీలను బయటకు తీసి రిపేర్లు చేయించుకొని రాబోయే ఎండాకాలనికి ప్రజలు సిద్ధమవుతున్నారు. తాజాగా ఉమ్మడి…
ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దిన పత్రికల మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత, జాతీయవాది ఎం.వి.ఆర్. శాస్త్రి తాజాగా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ‘నేతాజీ’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. అయితే ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కావాల్సి ఉంది. కానీ అదే సమయంలో ముందుగా అంగీకరించిన కార్యక్రమం కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొనలేదు. కానీ ఆ పుస్తకం విడుదలైన వెంటనే…
సికింద్రాబాద్‌లోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ప్రెస్ నోట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ తెలుగులోనే ప్రెస్‌నోట్‌లను విడుదల చేస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రెస్…
MLA Padma Devender Reddy Car Accident. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ పట్టణంలో నేడు పర్యటించారు. ఈ పర్యటన అనంతరం రామయంపేటలో ఓ వివాహానికి హాజరయ్యేందుక వెళ్తున్న క్రమంలో అక్కన్నపేట రైల్వే గేట్ వద్ద వెనుక నుంచి వస్తున్న వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో భారీ శబ్దంతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్న వాహనం ఎరిగిపడింది. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి…
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు…
Conflicts Between Telangana Congress Leaders. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. అగ్రనేతలే కాకుండా మధ్యతరగతి నేతల్లో కూడా ఆదిపత్య పోరు సాగుతోంది. తాజాగా హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగా హనుమకొండలో పాగా వేసేందుకు కొంతమంది కోవార్టులతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.…
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే లాలూ ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం ఉదయం ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం మళ్లీ లాలూ ఆరోగ్యం విషమించడంతో మరోసారి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి ఆయన్ను తరలించినట్లు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మీడియాకు వెల్లడించారు. లాలూ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో లాలూ…
విశాఖ జిల్లా పాయకరావుపేటలో కులధ్రువీకరణ పత్రాల స్కాం వెలుగుచూసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా బీసీ-డి కులానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలలో తప్పులు రావడంతో తహసీల్దార్ అంబేద్కర్‌ను బాధితులు ఆశ్రయించారు. అధికారుల పరిశీలనలో ఇవి నకిలీవిగా స్పష్టం కావడంతో అసలు విషయం బహిర్గతం అయ్యింది. విశాఖ కేంద్రంగా 27 మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. అయితే తనకు సంబంధం లేకుండా నకిలీ ధ్రువపత్రాలను మంజూరు…