తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు మినహా మరొకరులో లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రమే ప్రత్యేకమైన బార్ కోడ్ కలిగిన పాస్‌లను జారీ చేశారు. ఈ హైటెక్ పాసులు ఉంటేనే సమావేశం లోపలికి ఎంట్రీ.. లేకుంటే ఎంతటి వారికైనా..…
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీలో 4500 మందికి సరిపోయేవిధంగా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే దశ దిశ చూపుతోందని ఆయన…
హైదరాబాద్‌లో 3 టిమ్స్ ఆసుపత్రులను నిర్మించబోతున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ 3 ప్రాంతాల్లో నూతనంగా నిర్మించబోతున్న టిమ్స్ ఆసుపత్రులకు భూమిపూజలు చేశారు. ఈ సంద్భంగా ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. మతం క్యాన్సర్ కంటే ప్రమాదమన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే దేశం మనదని, శాంతిభద్రతలు బాగుంటే…
హైదరాబాద్‌లో 3 టిమ్స్ ఆసుపత్రులను నిర్మించబోతున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ 3 ప్రాంతాల్లో నూతనంగా నిర్మించబోతున్న టిమ్స్ ఆసుపత్రులకు భూమిపూజలు చేశారు. ఈ సంద్భంగా ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. ఎండాకాలం వస్తే ఎమ్మెల్యే చావుకు వచ్చేదని.. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా.. బిందెలతో ప్రదన్శలు చేసేవారన్నారు. తెలంగాణ నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మిషన్ భగీరథ పుణ్యమా అని ఇప్పుడు…
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వం విప్ బాల్క సుమన్‌పై నిప్పులు చెరిగారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా..తప్పు లేదు నీకు అంటూ బాల్క సుమన్‌పై విమర్శలు చేశారు. బాల్క సుమన్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు… కేసీఆర్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపితే మంచిదని, కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చి రాజకీయంగా మేము లాభం పొందినమా..? అని అన్నారు. లాభం పొందింది మీరు రిజర్వేష్లు రాలేదు.. రుణమాఫీ…
నగరంలో కలుషిత నీళ్లు త్రాగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదని ఆయన ఆరోపించారు. నిజాం కాలంలో వేసిన పైపులైన్ లే ఇప్పటికి ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్.. ఎనిమిదేళ్లు అయిన సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. వర్షాకాలం…
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన కూడల్లో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీసీసీ ప్రభాకర్. ఇతర రాజకీయ పార్టీలు కడితే ఫైన్ లు వేస్తారు… కేసులు పెడతారని, అవే నియమ నిబంధనలు అధికార పార్టీ కి వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. పురపాలక శాఖ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారన ఆయన మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమం వెనక ఉన్నది కాంగ్రెస్ కాదా..? . ఉద్యమం మొదలు పెట్టిన ఇన్నారెడ్డి ఎటు పోయారు..? అని ఆయన ప్రశ్నించారు. బాల్క సుమన్‌కి ఏం తెలుసు…చిన్న పిల్లగాడు.. తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు.. అంటూ వ్యాఖ్యానించారు. గల్లీలో గోళీలు ఆడుకునే సుమన్.. ఎంపీ.. అయ్యాడు…ఎమ్మెల్యే అయ్యాడు.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఇన్నరెడ్డి… కనీసం కార్పొరేటర్…
ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కీలక నిర్ణయం తీసుకుంటూ.. వివరాలను ప్రకటించింది. వచ్చే వేతనాల నుంచి అందుకునేలా 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు, మూల వేతనంపై 5 శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు…