Chintala Ramachandra Reddy : నిజాం కాలంలో వేసిన పైపులైన్‌లే ఇప్పటికీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో కలుషిత నీళ్లు త్రాగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదని ఆయన ఆరోపించారు. నిజాం కాలంలో వేసిన పైపులైన్ లే ఇప్పటికి ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్.. ఎనిమిదేళ్లు అయిన సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు.
వర్షాకాలం సమీపిస్తున్న నాలాల్లో పూడిక తీయడం లేదని, శివారు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలను వాటర్ బోర్డ్ గాలికొదిలేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జలమండలికి ఇస్తానన్న 500 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలుషిత నీళ్లు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. త్రాగు నీటికి,డ్రైనేజికి కొత్త పైపు లైన్ల వేయాలని, పది రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే హైదరాబాద్ ను దిగ్బంధిస్తామన్నారు.
Also Read
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!