టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమం వెనక ఉన్నది కాంగ్రెస్ కాదా..? . ఉద్యమం మొదలు పెట్టిన ఇన్నారెడ్డి ఎటు పోయారు..? అని ఆయన ప్రశ్నించారు. బాల్క సుమన్‌కి ఏం తెలుసు…చిన్న పిల్లగాడు.. తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు.. అంటూ వ్యాఖ్యానించారు. గల్లీలో గోళీలు ఆడుకునే సుమన్.. ఎంపీ.. అయ్యాడు…ఎమ్మెల్యే అయ్యాడు.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఇన్నరెడ్డి… కనీసం కార్పొరేటర్ కూడా కాలేదని ఆయన అన్నారు. సుమన్ ఎమ్మెల్యే కాగానే… ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అంతా ఎమ్మెల్యే ఐనట్టా..? సోనియా..రాహుల్ గాంధీలు రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యేటోడా..? అని ఆయన ప్రశ్నించారు.
సుమన్ ఎమ్మెల్యే..ఎంపీ అయ్యే వాడు కాదు.. నువ్వేంటో అనేది ఆలోచించుకొని మాట్లాడు అంటూ హితవు పలికారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడే అంతటి వాడివా..? రాహుల్ గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలి .. నీ డిమాండ్ కి అర్దం ఉందా..? ఉస్మానియాలో విద్యార్దులు ఆత్మహత్య చేసుకునేటప్పుడు నీవెందుకు ఆపలేదు ఇంట్లో ఉన్నవ..పక్కనే ఉన్నావా..ఎక్కడైనా పడుకున్నావా..? డెడ్ బాడీ ల మీద నువ్వు ఎమ్మెల్యే ..ఎంపీ అయ్యావు.. కోటీశ్వరుడివి కూడా అయ్యావు. వాళ్ళ డెడ్ బాడీలా మీద రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాడా..? అని ఆయన ప్రశ్నించారు. వాళ్ళ శవాల మీద కేసీఆర్ సీఎం …కొడుకు మంత్రి…బిడ్డ. ఎంపీ.. అల్లుడు మంత్రి అయ్యారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ శవాల మీద నువ్వు కూడా సెటిల్ అయ్యావన్నారు. ఆత్మహత్యే చేసుకున్న కుటుంబాలు… తెలంగాణ సెటిల్ అయ్యిందా..? అని ఆయన ధ్వజమెత్తారు.