హైదరాబాద్‌లో 3 టిమ్స్ ఆసుపత్రులను నిర్మించబోతున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ 3 ప్రాంతాల్లో నూతనంగా నిర్మించబోతున్న టిమ్స్ ఆసుపత్రులకు భూమిపూజలు చేశారు. ఈ సంద్భంగా ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. మతం క్యాన్సర్ కంటే ప్రమాదమన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే దేశం మనదని, శాంతిభద్రతలు బాగుంటే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయన్నారు. కులం, మతం పేరుతో గొడవలు జరిగితే ఎవరూ రారన్నారు. గొడవ పడితే మన కాళ్లు మనమే నరుక్కున్నట్లు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా వైద్య విధానాన్ని పటిష్టం చేసేందుకు పేదలకు వైద్యం అందించేందుకు పూస కుచినట్టు హరీష్ రావు చెప్పారని, పేదలు పాపం వైద్యం కోసం వస్తే దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోతారు అయితే పేదలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మేము చూశామన్నారు. నిలోఫర్ హాస్పిటల్ లో ఓక్కరు చనిపోతే శవాన్ని తీసుకుకొనింపోవడానికి డబ్బులు లేవు అని వార్త వచ్చిందని, వెంటనే సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి 50 అంబులెన్స్ లు ఏర్పాటు చేయమని చెప్పానన్నారు. ఇలా అంబులెన్స్ లు దేశంలో కాదు ప్రపంచ లో ఎక్కడ లేవని, నగరం మీద లోడ్ ఎక్కువతుంది కాబట్టి 4 హాస్పిటల్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.