గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుడు శుక్రవారం ఉదయం ఎంజీఎం జంక్షన్ వద్ద 58 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సెల్ఫ్‌లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్)ను గుర్తించారు. నివేదికల ప్రకారం, ఒక పారిశుధ్య కార్మికుడు, MGM జంక్షన్ గుండా వెళుతుండగా రోడ్డుపై రైఫిల్‌ను గమనించాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారు రైఫిల్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకు అందజేశారు. ఇది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌గా గుర్తించిన కమిషనర్ పోలీసులకు సమాచారం అందించారు.…
విశాఖ సి.ఆర్.జెడ్ ప్రాంతంలో నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్టును వెంటనే సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సీ.ఆర్.జెడ్ నిబధనలను ఉల్లంఘించి జరుపుతున్న కాంక్రీట్ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిపింది.
నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు కారాగారం వద్దకు పిన్నెల్లి అనుచరులు తరలివచ్చారు. విడుదలకు సంబందించిన సమయం ముగియడంతో పోలీసులు, పిన్నెల్లి అనుచరులు వెనుదిరిగారు.
అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి , వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారన్న నాయకులు మండిపడ్డారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అరాచక పాలన…
డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. 6 గురితో కూడిన ముఠాను అరెస్ట్ చేసామని వెల్లడించారు. మొత్తం 3 రకాల నేరాలు చేశారని ఆయన తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేశారని, హర్షిణి రెడ్డి అనే మహిళ ఫేక్ లెటర్ లు, స్టాంపు లతో సహా క్రెయేట్ చేసిందని, A1 సురేందర్ రెడ్డి…
దళిత బంధు పథకం రెండోదశ కింద మంజూరైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితుల బంధు సాయం కోసం గుర్తించిన లబ్ధిదారులు ప్రజాభవన్ వద్ద నిరసన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఈ పథకం కింద రూ.10 లక్షల సాయం అందించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో లబ్ధిదారుడికి రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి ఆ పథకానికి అంబేద్కర్ అభయ హస్తం అని నామకరణం చేసింది. అయితే, పథకం…
మార్పు కావాలని.. ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని కాంగ్రెస్ నీ దివించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లు గా పని చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ వచ్చిన వెంటనే ఐదు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ……
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.