రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి… మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇద్దరు మహిళ జర్నలిస్ట్…
సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడని, ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ మంత్రులే రుణమాఫీ మొత్తం కాలేదని ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ…
చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడన్నారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని, ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు…
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ అని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్…
హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిబంధనల అమలు చేయటంలో పోలీసులు విఫలమవుతున్నారని హైకోర్టు మండిపడింది.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని, నేరాలు పెరిగిపోయయని ఆమె పేర్కొన్నారు. కొన్ని కేసులను రీ-ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలిపారు. ప్రతి కేసునూ రీ-ఇన్వెస్టిగేషన్ చేయలేం కానీ.. సంచలనం రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆలోచన చేస్తామన్నారు. మహిళా భద్రత సహా, వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని హోం మంత్రి తెలిపారు.
శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్థులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. హోం శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డుతూ పాడుతూ పాఠశాలకు వెళుతున్న ఓ విద్యార్థిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబలించింది. కడప నగరంలోని అగాడి వీధలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో విద్యార్థి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతానికి మా పార్టీది మూడు రాజధానుల విధానమేనని.. మూడు రాజధానులపై మా పార్టీ విధానం మార్చాలనుకుంటే మా నాయకుడితో చర్చించుకుంటామని స్పష్టం చేశారు.