ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది.. తర్వాత సైలెంట్ అయ్యిందని, రేవంత్ కూల్చేయడం మంచిదే అని ఆయన అన్నారు. నాగార్జున మంచి నటుడు కావచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు అని ఆయన అన్నారు. సినిమా డైలాగులు కొట్టడం కాదు అని, బుకాయింపు మాటలు వద్దని.. క్షమాపణ చెప్పాలి నాగార్జున అని ఆయన అన్నారు. ఇన్నాళ్లు అనుభవించిన దానికి ప్రభుత్వంకి పరిహారం…
హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతోటే యథేచ్ఛగా చెరువులు కబ్జాలకు గురైనవి అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా చేయడానికి అని ఆయన మండిపడ్డారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు,111, ఎఫ్టిల్, బఫర్ జోన్ భూములన్ని కబ్జా చేసిండ్రు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ…
కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గిపోతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి 45,855 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై అందినకాడికి దోచుక వెళ్తున్నారు..
పోచారం గ్రామానికి చెందిన యువకుడితో మరో సారి కోమలకు పెళ్లి సంబంధాన్ని కుదుర్చారు. ఈ నెల 28వ తేదీన ఘనంగా వివాహం చేయాలని కోమల తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇక, పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. కాగా, నిన్న ( శనివారం) రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో కోమల ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే మోసం చేయటంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయటంతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్ కాలనీలో నివసించే తాళ్ళపల్లి రాజశేఖర్ ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దే ఉన్న మనీషా(27) అనే యువతిని ప్రేమించటంతో, ఆ యువతి వారి ప్రేమ…
రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో నాణ్యమైన వైద్య విద్య ను అందించడంతోపాటు మెడికల్ UG, PG అడ్మిషన్ ల భర్తీపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్య ను అందించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కృషి చేయాలని మంత్రి అధికారులను…
ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతపరిచేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
కూల్చివేతల వెనుక రాజకీయ హస్తముందా.? అధికార పార్టీ నేతల అక్రమకట్టడాలు కూడా కూలుతాయ? కూల్చివేతలు వసూళ్లకేనన్న ఆరోపణల్లో వాస్తవమెంత? 111 జీవో భూముల్లో కూడా హైడ్రా ఎంట్రీ అవుతుందా.? హైడ్రా టార్గెట్ సామాన్యులా.? బడాబాబులా.? హైడ్రా అసలు లక్ష్యమేంటి?.. ఇవాళ హైడ్రా కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్పై దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఎన్టీవీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూడండి…
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండని, రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు…