మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తాను పార్టీ దూరంగా ఉన్నానని.. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి కనీసం పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీకి చెబుదాం అంటే కనీసం వినే పరిస్థితుల్లో లేదన్నారు.
Telangana Governor: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు.
రాష్ట్రంలోని హైడ్రా ఏజెన్సీ అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న డ్రైవ్‌ల మధ్య, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తాను స్థాపించిన సంస్థల కూల్చివేతకు వాదిస్తున్న వారిని విమర్శించారు. అక్బరుద్దీన్ ఒవైసీ విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, విద్య కొంతమందిలో “అసూయను రేకెత్తిస్తున్నాయి” అని నొక్కిచెప్పారు, వారు నిరుపేదలను ఉద్ధరించడానికి తన ప్రయత్నాలను అణగదొక్కాలని నిర్ణయించుకున్నారు. ఒవైసీ అక్రమ భూమిని ఆక్రమించాడా అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ, రాజేంద్రనగర్‌లోని బం-రుక్న్-ఉద్-దౌలా…
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎంపీ డీకే.అరుణ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని, రుణమాఫీ ఒక మోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులలో 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో రైతులను అయోమయానికి గురిచేసి ఇంట్లో ఒకరికే రుణమాఫీ చేస్తామంటూ రేషన్ కార్డు…
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపటి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 27న యాదాద్రి ఆలయం దర్శించుకోనున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు చేరుకుంటారు..ములుగు జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి లక్నవరంకు వెళ్లనున్నారు. రాత్రి లక్నవరం లో బస చేసి మరుసటి రోజు హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో…
ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను , టీ షర్ట్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్…
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశామని, ఇంకో ముపై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నామని, సివిల్స్ విద్యార్థులకు అతస్థైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరికి లక్ష…
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలన్నారు. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది నీ కొంతైనా తగ్గించాలని లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, లక్ష పెద్ద నగదు కాకపోయినా.. కొంతైనా ఉపశమనం కలగాలని మా ప్రయత్నమన్నారు భట్టి విక్రమార్క.…