రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ వేములవాడ లో 300 MTS గోదాం, Kdccb వేములవాడ శాఖ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. 2009 లో కరీంనగర్ ఎమ్మెల్యే కావాలని అనుకున్న వైఎస్ఆర్ ఎంపీగా పోటీ…
చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై హరీష్ రావుతో ఓ కమిటీ వేద్దాం.. అక్రమ నిర్మాణాలు దగ్గర ఉండి కూల్చివేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము చేస్తున్న మంచి పనులు చూసి పార్టీలోకి వస్తాం అంటున్నారు. భయపెట్టి, బ్రతినిలాడి ఎవర్నీ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో కేస్ బై కేస్ విచారణకు సీబీఐకి అనుమతి ఇచ్చామన్నారు. వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన తెలిపారు.…
దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టు తెలిసింది.
YS Jagan: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తాను పార్టీ దూరంగా ఉన్నానని.. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి కనీసం పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీకి చెబుదాం అంటే కనీసం వినే పరిస్థితుల్లో లేదన్నారు.
Telangana Governor: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు.