బుద్ధభవన్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఎంపీ అనిల్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరుపై ఎంపీ అనిల్ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు అనిల్ యాదవ్ కేటాయించారు. 25 లక్షలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్‌కు అనిల్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారని,…
ముంబై సినీ నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై విచారణ అధికారిని బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు అని, చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నాడని, నేను ఇప్పటి కి రాజీనామా కి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని,…
ఎస్సీ వర్గీకరణ కోసం 1994 లో స్టార్ట్ చేసామని, గజ్వేల్ కేంద్రంగా ఎస్సీ వర్గీకరణ ఆద్యం పోసిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం జర్నలిస్ట్ ల సేవలు మరచిపోలేమని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దళితుల్లో విభజన అవసరమా లేదా అనే చర్చ మొదలైందని, అమరవీరుల త్యాగం తో ఏర్పాటు అయింది తెలంగాణ అని ఆయన అన్నారు. ఏ రాష్ట్రములో లేని…
గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేశారు. అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్‌మెంట్ మార్చాలని… అది ఫైనల్ అయిపోతే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న . ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ,…
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె అన్నారు.…
చెక్కులు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే అందించాలని హై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మంత్రి పొన్నం కావాలనే అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకొని ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. అవగాహన లేక ఎమ్మార్వో కార్యాలయాల్లో చెక్కుల…