Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన
- నేడు ములుగు- భూపాలపల్లి జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన..
- రాత్రి లక్నవరంలో బస చేయనున్న గవర్నర్ జిష్ణుదేవవర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Governor: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు. రాత్రి లక్నవరంలో బస చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు. అనంతరం మధ్నాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా అధికారులను పరిచయం చేసుకోనున్నారు.
Read also: MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
Also Read
ఇక ఒంటి గంట నుంచి మధ్నాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్ లో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశమై మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. ఇక 3 గంటలకు రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. సరస్సును సందర్శించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను సందర్శించి పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి 6:30 గంటలకు లక్నవరం సరస్సు వద్ద ఉన్న హరిత రిసార్ట్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేయనున్నారు.
Read also: Adilabad Agency: నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్..
రేపు (28)న హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో సమావేశం కానున్నారు. అనంతరం వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి వరంగల్ నిట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఎల్లుండి (29)న మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శిస్తారు. గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్న నేపత్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!