సౌత్ ఆఫ్రికాలోని నైజీరియాలో ఘోరం జరిగింది..ఘోర పడవ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో 103 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.. క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 103 మంది మరణించారు. ఉత్తర మధ్య నైజీరియా లో పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న అతిథుల పడవ నీట మునిగింది.. ఈ ప్రమాద సమయంలో 200 మందికి పైగా ప్రయానిస్తున్నారని, మొత్తం నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఒకేసారి అంత మంది చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.. ఆ ప్రాంతమంతా విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి.. గతంలో కూడా చాలానే వెలుగు చూసాయి.. ఈ ఘోర ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదు..
నైజర్ స్టేట్‌లోని వివాహ వేడుక నుంచి క్వారా రాష్ట్రం లో ప్రజలను తీసుకువెళుతుండగా నది లో పడవ మునిగిపోయిందని, అన్వేషణ కొనసాగుతోందని చెబుతున్నారు.. ఈ ప్రమాద సమయం లో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వలన, వర్షాకాలంలో భారీ వరదల కారణంగా నదిలో పడవ బోల్తాపడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.. అందుతున్న సమాచారం మేరకు.. పడవ ప్రమాదం లో 103 మంది మరణించారని,మరో 100 మందిని రక్షించామని క్వారా రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మి అజయ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా..
ప్రస్తుతం పోలీసులు మృతి చెందిన వారిని వెలికి తీసే పనిలో ఉన్నారు.. నైజీరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం గమనార్హం. ఇక్కడి ప్రజలు తరచుగా స్థానికంగా తయారైన ఓడలను ఉపయోగిస్తారు, దీని కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గత నెలలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌లోడ్ కారణంగా పడవ బోల్తా పడి 15 మంది పిల్లలు మునిగిపోయారు.. మరో 25 మంది కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. ఇక వరుస ప్రమాదాలు జరిగితున్న కూడా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోలేదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..