Health: మనం ఏదైనా పని చేయాలంటే మూడ్ బాగుండాలి. అంతేకాకుండా ఆ పని చేసేందుకు మానసికంగా సిద్ధమైనప్పుడే పని చేయగలుగుతాం. కొన్నిసార్లు మనతో ఉన్న వ్యక్తులు.. మనల్ని కించపరిచేలా.. తిట్టినా ఇట్టే మనకు కోపమొచ్చి ఆ పని మీద ఇంట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. మన మానసిక స్థితికి , మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. మనిషికి కోపం, దుఃఖం, ఆనందం కలగడం సహజం. కానీ చిన్న చిన్న విషయాలకు కోపగించుకున్న, చిరాకు పడినా అది మన ఆరోగ్యానికే ఎఫెక్ట్. అలా ఉన్నట్లైతే.. అది డిస్టిమియా కూడా కావచ్చు.
Read Also: Adipurush: తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి పర్మిషన్.. ఎంత పెంచుకోవచ్చంటే?
అసలు డిస్టిమియా అంటే ఏమిటి?.. వైద్య పరిభాషలో దీనిని పెర్సిస్టెన్స్ డిప్రెసివ్ డిజార్డర్ అంటారు. ఇది దీర్ఘకాలిక డిప్రెషన్ లేదా మూడ్ డిజార్డర్. ప్రాథమిక దశలోనే ఇది పరిష్కరించకోవాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సివస్తుంది. ఎక్కువగా ఈ సమస్య ఉన్నవారు డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, చిరాకుగా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువ కాలం ఏ విషయాన్ని ఇష్టపడరు, ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు.
Read Also: TCS: ఉద్యోగానికి గుడ్ బై చెబుతున్న మహిళా టెక్కీలు.. కారణం ఇదే..
డిస్టిమియా లక్షణాలు: ఏదైనా వ్యాధి దాని ప్రారంభానికి ముందు కొన్ని లక్షణాలను చూపుతుంది. ముఖ్యంగా మానసిక అనారోగ్యాలు బహిరంగంగా తెలుసు. డిస్టిమియా కూడా ఒక మానసిక వ్యాధి కాబట్టి, కొన్ని లక్షణాల ద్వారా కూడా దీనిని గుర్తించవచ్చు. మూడ్ డిస్టర్బెన్స్, రోజంతా విచారంగా ఉండటం, మానసిక స్థితి తగ్గడం, శక్తి లేకపోవడం, నీరసం, అలసట, ఏకాగ్రత లేకపోవడం, మాటల పట్ల కోపం, పనిలో ఆసక్తి కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో విముఖత, ప్రతిదానికీ తనను తాను నిందించుకోవడం, ఆకలి లేకపోవడం వంటివి ఉంటే డిస్టిమియా లక్షణాలుగా చెబుతారు. డిస్టిమియాకి ఖచ్చితమైన కారణం డాక్టర్లకు కూడా తెలియదు. కానీ రోజువారీ జీవితంలో కొన్ని సంఘటనలు, పరిస్థితులు, చుట్టుపక్కల సమాజం కారణంగా, ఒక వ్యక్తి ఈ స్థితికి రావచ్చు.