రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని…
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలకు అతలాకుతలమవుతున్నాయి. అయితే.. అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ట్విట్టర్, సోషల్ మీడియాలకే కేటీఆర్ హరీష్ రావులు పరిమితమయ్యారని విమర్శించారు. వారు ప్రజలను మర్చిపోయారని, తమది గడిల పాలన కాదని, మేము గడి లకు పరిమితం కాలేదన్నారు భట్టి. వరదలు రాగానే ప్రజలలోనే వున్నామని, సహాయ చర్యలను అందించామన్నారు. రెస్క్యూ ఆపరేషన్…
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్ లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మూడు చోట్ల సుమారు వెయ్యి మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్లు పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా రద్దయ్యాయి. 68 రైళ్లను దారి…
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90శాతానికి చేరుకుంది. మరి కొన్ని గంటలలో ప్రాజెక్టు వరద గేట్లుఎత్తి గోదావరి నదిలోకి వదిలి అవకాశం ఉంది. కావున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల…
తెలంగాణలో భారీవర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షా కు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 2న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెప్టెంబర్ 3 నుండి పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించబడతాయని తెలిపారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణీత సమయంలో తెలియజేస్తాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల సూచన…
శని, ఆదివారాల్లో కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల కంటే సిద్దిపేట జిల్లాలో ఎక్కువ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సిద్దిపేటలోని మిరుదొడ్డి మండలంలో 152.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కాలంలో సిద్దిపేటలోని 12 మండలాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లోని రెండు మండలాల్లో 100…
దక్షిణ మధ్య రైల్వేలో భారీగా రైళ్లను రద్దు చేసింది. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రవాణా వ్యవస్థ స్థంభించింది. ఒకే సారి 80కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్ ల మీదకు వరద నీరు చేరుకుంది. రైల్వే ఉన్నతాధికారులు రైల్వే నిలయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతికి కేసముద్రం, విజయవాడ రాయంపాడు ట్రాక్ ల మీద నుంచి వరద…
మహబూబాబాద్ జిల్లాలో విషాదం మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి తండ్రి కూతురు నీట మునిగి చనిపోయారు. ఆదివారం ఉదయం మరిపెడ (మ) పురుషోత్తమాయగూడెం దగ్గర ఉన్న బ్రిడ్జి పై నుండి వరదనీరు.. ప్రవహిస్తున్న ప్రవాహాన్ని అంచనా వేయకుండా వెళ్లిన కారు కొట్టుకొని పోయి ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిగా గుర్తింపు. కారులో తండ్రీకూతురు ఇద్దరూ హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరారు.…
శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గత కొంతకాలంగా ఇబ్బందులకు గురవుతున్న తమను పట్టించుకునే నాధుడే లేడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అయితే విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు బాలికలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అన్ని…