ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం లతో కలిసి లోయర్ మానేర్ డ్యాం ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు కూరు స్తున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు. గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు…
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాల కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరద తో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరి లోకి వదులుతున్నారు.…
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుందని, వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి.…
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…
భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు.
Heavy Rains: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తు న్నాయి.
భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.
తుంగభద్ర డ్యామ్ మళ్లీ నిండుకుండలా మారింది. డ్యామ్ అధికారులు ఇవాళ గేట్లు ఎత్తనున్నారు. గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుంగభధ్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయి స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు తరువాత డ్యామ్ మళ్లీ నిండడం గమనార్హం. గేటు కొట్టుకుపోయి భారీగా నీరు వృథా అయినా వరుణుడు మళ్లీ కరుణించాడు.
వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.