భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.
తుంగభద్ర డ్యామ్ మళ్లీ నిండుకుండలా మారింది. డ్యామ్ అధికారులు ఇవాళ గేట్లు ఎత్తనున్నారు. గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుంగభధ్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయి స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు తరువాత డ్యామ్ మళ్లీ నిండడం గమనార్హం. గేటు కొట్టుకుపోయి భారీగా నీరు వృథా అయినా వరుణుడు మళ్లీ కరుణించాడు.
వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి…
భారీ వర్షాలపై అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలోని వాయుగుండం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో భారీ నుండీ అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖాధికారులను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత ప్రభుత్వ వాతావరణ శాఖా రెడ్ ఏలెర్ట్ ప్రకటించిన నేపద్యంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.…
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
హైడ్రా వల్ల పేదలకు ఎటువంటి నష్టం కలగకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఏ పార్టీ వ్యక్తుల నిర్మాణాలైనా కూల్చివేస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని విజ్ఞప్తుల మేరకు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆసవుద్దీన్ విద్యాలయలకు హైడ్రా నోటీసులు పంపిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు పంపిందని ఆయన తెలిపారు. గత…