కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు పాకేజ్ ని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతుండు అని ఆయన మండిపడ్డారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదని, యువరాజు కేటీఆర్, ఎలెన్ మాస్క్ x ప్లాట్ ఫామ్ మీద…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండీ భవిషత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మంచి కార్యక్రమం చేయలేదన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ లో 90 శాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్ఎస్ నాయకులే అని, నేను ప్రూవ్ చేయడానికి సిద్ధమన్నారు ఆయన. ఆ పాపం అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు దే…
భారీ వర్షాలతో తెలంగాణలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రెండు కేంద్ర బృందాలు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నాయని, NDRF బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు కేంద్రం సహాయం ప్రకటించిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబర్ 17 అని, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నిర్వహించలేకపోతోందని ఆయన విమర్శించారు. సెప్టెంబర్ 17…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. దీంతోపాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో(యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేశారు. అట్లాగే ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని…
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణలో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరదలు భీభత్సం సృష్టించాయి. వరంగల్ జిల్లాలోని పలు లింక్ రోడ్లు వరదల ధాటికి తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా.. శిథిలావస్థకు చేరుకున్న కొన్ని భవనాలు సైతం వరదల దెబ్బకు నేలకూలాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే పాతభవనాలను కూల్చివేసేందుకు పూనుకుంది అధికార యంత్రాంగం. అయితే.. ఈ క్రమంలోనే గ్రేటర్ వరంగల్ మన్సిపల్ కార్పొరేషన్ పాల…
TG Rain Alert: భారీ వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యాయని మంత్రి చెప్పారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు షేక్ ముగ్దమ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జికి ఆనుకుని గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీకి అండగా నిలుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.