వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ రైతులందరు యాసంగి పంట కోసం గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో మూడు, నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యుట్ ప్లాన్ ప్రాకారం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు పంటలకు నీరందించామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకమైన ఏజన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక…
అనకాపల్లి జిల్లాలో కోడికత్తి దాడి కేసు కులం రంగు పులుముకుంది. నిందితులపై చర్యలు చేపట్టాలని ప్రత్యర్థి వర్గం రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన యువకులు మధ్య కనుమపండుగ రోజు కోడి పందాల విషయంలో వాగ్వివాదం జరిగింది.
దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలకు కేంద్రమైన నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించడం శుభపరిణామమని అని బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ అన్నారు.
పరిస్థితి ఈడు వరకు వచ్చింది కుక్కలను నియంత్రించాలని వికారాబాద్ టీఆర్ఎస్ యువ నాయకుడు రాజేందర్ గౌడ్ తన బెంజ్ కార్ రూఫ్ లో ఎక్కి ఓ ప్లే కార్డ్ చేతిలో పట్టుకొని కారులో ఉండి పట్టణ మొత్తం తిరుగుతూ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే.. దేశంలో వీధి కుక్కల దాడులు భారీగా పెరుగుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 2 కోట్ల మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఓ నివేదికలో…
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు.
నల్లగొండ పట్టణంలో మున్సిపల్ రోడ్ల నిర్మాణంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. UPSC…
చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు.
నిజామాబాద్ ఆంధ్రానగర్‌లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ కానుందని ఆయన వెల్లడించారు. రైతాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆంధ్ర నగర్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు మంత్రి తుమ్మల. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరని, ఎన్టీఆర్ నేటికీ తరానికి ఆదర్శ ప్రాయుడని ఆయన కొనియాడారు.…
దేశంలో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది.. మనం పీల్చే గాలిలో ఎన్నో విషపూరీత వాయువులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది.. ఈ ఏడాది అత్యంత కాలుష్యం నగరాల లిస్ట్ లోకి బాలాసోర్ నిలిచింది..…
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం.. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వెంకీ పవర్ ఫుల్ యాక్టింగ్, శైలేష్ కొలను దర్శకత్వం, యాక్షన్, ఎమోషనల్ అంశాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వెంకీ 75 వ చిత్రంగా తెరకేక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది..…