భారత్ ఇప్పుడు పెద్ద కలల కంటోందని.. కలలను నెరవేర్చడానికి పగలు, రాత్రి పని చేస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సుమారు రూ.41,000 కోట్ల విలువైన 2,000 కంటే ఎక్కువ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.’ఆపరేషన్ వాలంటైన్’, ‘వ్యూహం’, ‘చారీ 111’, ‘భూతద్దం భాస్కర్’ తదితర చిత్రాలొస్తున్నాయి. వీటిపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు.…
ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి… ఇప్పుడు…
బ్యాంక్ కస్టమర్లకు బ్యాంకుల్లో ఎప్పుడూ ఏదో పని ఉంటూనే ఉంటుంది. అందుకే బ్యాంకుల్లో ఏదైనా పని కోసం వెళ్లాలంటే.. ముందుగా బ్యాంక్ సెలవులపై అవగాహన ఉండాలి. బ్యాంక్ ఏరోజు పనిచేస్తుందో.. ఏరోజు సెలవు ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.
ఇంటర్నేషనల్ నంబర్స్‌తో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.
ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ-జనసేన తొలి జాబితాపై సెటైర్లు వేశారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. వాళ్లు అమిత్‌షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.