టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇంతవరకు రొమాంటిక్ సాంగ్స్ చెయ్యని ఈ అమ్మడు ఇప్పుడు మొదటి సారి రొమాన్స్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు…
ఒకప్పుడు సినిమాలను చూడటానికి సింగిల్ థియేటర్స్ వెళ్ళేవాళ్లు.. కానీ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. అక్కడ జనాలు ఎక్కువగా సినిమాలు చూడటం వల్ల సింగల్ థియేటర్ల వైపు వెళ్లడం జనాలు తగ్గించేశారు.. టికెట్ ధర ఎక్కువైన కూడా మల్టీప్లెక్స్ లలోనే సినిమాలను చూస్తున్నారు.. కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న…
హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి బుపెంద్ర భాయ్ పాటిల్ కి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారం లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో.. ఎవరి నేతృత్వంలో అవినీతి రహిత దేశం ఏర్పడుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నానన్నారు.
సింగరేణి సంస్థల్లో పని చేసే 43 వేల మందికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయల భీమా వర్తించే పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. కార్మికులను కాపాడుకోవడం మా భాద్యత అని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కు కూడా 20 నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి…
మహారాష్ట్రలో పుణెలోని పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలుడిని వడపావ్‌తో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
మూడో సారి మోడీ ప్రధాని చేయడానికి చేపట్టిన యాత్ర ఈ విజయ సంకల్ప యాత్ర అని అన్నారు బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్. ఇవాళ ఖైరతాబాద్ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాధ్యం అనే దాన్ని సుసాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోడీది అని ఆయన కొనియాడారు. ఆర్టికల్ 360 నీ రద్దు చేసే విషయంలో కేవలం మోడీ ఘనతేనన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్నటువంటి త్రిబుల్…
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ, విద్యుత్ కార్మికులతో పోటీ పడి సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటున్నామని, ఖనిజ నిక్షేపాలు కేంద్రం అమ్ముకుంటుంటే గత ప్రభుత్వం నిలువరించ లేకపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 72 వేల కోట్ల అప్పులతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభమై 7 లక్షల…
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత్పై విషం చిమ్మారు. తన 22 మంది సభ్యుల కేబినెట్లోని ముగ్గురు మంత్రులను విదేశీ దేశం ఆదేశాల కారణంగా మాల్దీవుల పార్లమెంట్ తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. నిజానికి మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వ కేబినెట్ ఏర్పాటైన తర్వాత అందులో చేరిన మంత్రులు పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి.
ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత…
రష్యా ఆర్మీలో సహాయకులుగా రిక్రూట్ అయిన భారతీయులను ఇప్పుడు విడుదల చేస్తున్నారు. దీనిపై రష్యా అధికారులతో భారత్ మాట్లాడిందని, కాంట్రాక్టుపై నియమించుకున్న భారతీయులను విడుదల చేయాలని డిమాండ్ చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ డిమాండ్తో చాలా మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగొచ్చారు.